లబ్ధిదారులకు న్యాయం చేస్తాం..

మహబూబాబాద్, జనవరి 4: లబ్ధిదారులకు సరైన న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే సందర్భంగా ఫిర్యాదుదారులు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ మండలాల్లో ఎస్సీలకు ప్రభు త్వం ఇచ్చిన భూములు లబ్ధిదారులకు అందేలా చూ స్తామని తెలిపారు. ఈ గ్రీవెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో కొమురయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సహకారంతో ఉన్నతంగా ఎదగాలి
ప్రభుత్వ సహకారంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆకాంక్షించారు. తప్పిపోయిన, వేదింపులకు గురైన, అక్రమ రవాణాకు బాధితులైన బాలల పరిరక్షణకు రాంచంద్రాపురం కాలనీలో నిర్వహిస్తున్న దైవక్రుప అనాథాశ్రమాన్ని సోమవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సవితతో కలిసి సందర్శించారు. అనాథాశ్రమంలో ఉన్న 13 మంది పిల్లల కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ్రమంలో కేక్‌కట్ చేసిన కలెక్టర్ పిల్లలకు స్వీట్లు పంచి పెట్టారు. వివిధ శాఖ అధికారు లు అందించిన నోటుబుక్స్, పెన్నులను అందించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో కొమురయ్య, ఆర్ఆర్బీఈఈ తానేశ్వర్, ఇరిగేషన్ ఈఈ మోహన్‌రావు, టీడబ్ల్యూ ఐడీసీ షఫీమియా, బాలల పరిరక్షణ విభాగం అధికారి కమలాకర్ పాల్గొన్నారు.