శనివారం 23 జనవరి 2021
Mahabubabad - Dec 06, 2020 , 06:43:50

గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

మరిపెడ :  ఎస్టీ డిగ్రీ గురుకుల కళాశాలలోని గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకన్న సూచించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులకు ఖాళీ ఫ్యాకల్టీ పోస్టుల వివరాలను వెల్లడించారు. కంప్యూటర్‌ సైన్స్‌ బోధనకు గెస్ట్‌ లెక్చరర్‌, కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ ఆపరేటర్‌ పోస్టుల కోసం పీజీ పూర్తి చేసి 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులన్నారు. మెరిట్‌ ఆధారంగా డెమో నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9398660091, 94943 63595 ఫోన్‌ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. logo