గుడుంబా దందాపై ఉక్కుపాదం

- 75 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం..
- 1692 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం
- 1025 మందిపై 960 కేసులు, 161 వాహనాలు సీజ్
- ఐదుగురిపై పీడీ యాక్టు నమోదు
మహబూబాబాద్, డిసెంబర్ 4 : గుడుం బా దందాపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపా దం మోపుతున్నారు. జిల్లాలోని మారుమూ ల తండాలు, గ్రామాలు, కాలనీల్లో ఎన్ఫోర్స్మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఎక్సైజ్, డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, రెవెన్యూ అధికారులు గుడుంబా స్థావరాలపై సంయుక్తంగా దాడులు చేసి మానుకోటను గుడుంబా రహిత జిల్లాగా మార్చారు. గుడుంబా దం దాపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉ పాధి చూపించారు. వివిధ పథకాలు అమ లు చేసి వారికి లబ్ధి చేకూర్చి గుడుంబా త యారీ, విక్రయాలను అధికారులు అరికట్టగలిగారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నల్లబెల్లం రవాణా మళ్లీ పెరిగింది. దీంతో నల్లబెల్లం, గుడుంబా తయారీ విక్రయాలపై దృష్టిసారించిన కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల ఆదేశాలతో ఎక్సైజ్, డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అన్ని మండలాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి. మహబూబాబాద్, తొర్రూరు, గూడూరు ఎక్సైజ్స్టేషన్లలో లక్షా 69 వేల 276 క్వింటాళ్ల నల్లబెల్లం, 11 క్వింటాళ్ల 282 కేజీల పటిక, 4 వేల 186 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 75 వేల 625 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 1025 మందిపై 960 కేసు లు నమోదు చేశారు. రవాణాకు ఉపయోగించిన 161 వాహనాలను సీజ్ చేశారు.
ఐదుగురిపై పీడీ యాక్టు...
మహబూబాబాద్, తొర్రూరు ఎక్సైజ్స్టేషన్ల పరిధిలో నల్లబెల్లం వ్యాపారం చేస్తున్న మహబూబాబాద్ మండలం వేంనూరు గ్రా మ శివారు నేతాజీ తండాకు చెందిన గుగులోత్ మహేందర్, డోర్నకల్ మండలం మో ద్గుల గడ్డకు చెందిన గుగులోత్ నరేశ్, ఏటిగడ్డతండాకు చెందిన ఆంగోత్ సుమన్, చిన్నగూడూరు మండలం బావోజీతండాకు చెంది న ధరంసోత్ వీరేశ్, మరిపెడ మండలం గుం డెపుడి గ్రామానికి చెందిన వెంకన్నపై కలెక్టర్ ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు పీడీ యాక్టు నమోదు చేశారు. మరికొంత మంది వ్యాపారుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సింగిల్ కేసున్నా పీడీ యాక్టు నమోదు చేస్తాం..
- జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి దశరథం
నల్లబెల్లం వ్యాపారులు, గుడుంబా తయారీ, విక్రయదారులపై ఒక్క కేసు ఉన్నా సరే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురిపై పీడీ యాక్టు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం. కేసుల ఉల్లంఘన కింద దంతాలపల్లికి చెందిన బుజ్జి, నర్సింహులపేటకు చెందిన సునీతను జైలుకు పంపించాం. సొంత పూచీకత్తుపై వివిధ కేసుల్లో బైండోవర్పై బయటకు వచ్చి నిబంధనలు ఉల్లఘించిన తొర్రూరుకు చెందిన రాజేశ్ నుంచి రూ.లక్ష జప్తు చేశాం. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సుమారు 40 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం.
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం