బుధవారం 20 జనవరి 2021
Mahabubabad - Dec 05, 2020 , 01:37:13

పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం

పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం

  •  ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయమని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో మానుకోట మండల ముఖ్య కార్యకర్తలు, సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ కార్యదర్శులతో విస్తృత స్థా యీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ  రాష్ట్రంలో పల్లెలను అన్ని రంగాల్లో  అభివృద్ధి చేసేందుకు కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. నిరు పేదలకు కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్‌ వంటి సంక్షే మ పథకాలను ప్రవేశ పెట్టి ఆదుకుంటున్నారన్నారు.  గ్రామాల్లోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కలిసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం మండలంలోని ప్రజా ప్రతినిధులు అందరు కలిసి నూతనంగా ఎన్నికైన మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ను, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నాయిని రంజిత్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లూనావత్‌ అశోక్‌ నాయక్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సుధగాని మురలి, మం డల కో ఆప్షన్‌ సభ్యుడు, ఎండీ షరిఫ్‌, నర్సింగ్‌ వెంకన్న, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు  సందా వీరన్న, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

కల్వర్టుకు శంకుస్థాపన..  

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కల్లు కాంపౌండ్‌ ప్రాంతంలో రూ.1.5 లక్షల వ్యయంతో కల్వర్టు పనులను ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ శుక్రవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఎండీ ఫరీద్‌, స్థానిక వార్డు కౌన్సిలర్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చిట్యాల జనార్దన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo