పల్లెల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- ఎమ్మెల్యే రెడ్యానాయక్
- బొడ్రాయితండా, జోగ్యాతండాలోఅభివృద్ధి పనులు ప్రారంభం
డోర్నకల్, డిసెంబర్ 3: పల్లెల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని బొడ్రాయి తండాలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన జీపీ భవనం, రూ.70 లక్షల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, శ్మశానవాటిక, పల్లెప్రకృతివనం, డంప్ యార్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామపంచాయతీగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 3వేల నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు అ య్యాయన్నారు. ప్రతి చిన్న గ్రామపంచాయతీకి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు మొండి కూతలు కూస్తున్నాయన్నారు. అనంతరం జోగ్యాతండా జీపీలో డంప్ యార్డు, పల్లెప్రకృతి వనం, శ్మశానవాటికలను ప్రారంభించారు. బొ డ్రాయితండా సర్పంచ్ తేజావత్ గమ్మిరాజు ఎమ్మెల్యే రెడ్యానాయక్, యువనాయకులు రవిచంద్ర, మండల అ ధ్యక్షుడు రమణ అధికారులను శాలువాతో సన్మానించారు.
అంతర్గత రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి..
నియోజకవర్గంలోని ప్రతి తండాకు, గ్రామాలకు లింక్రోడ్డులను కల్పించిన ఘనత డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కే దక్కుతుందని డోర్నకల్ నియోజకవర్గ యువజన నాయకులు డీఎస్ రవిచంద్ర అన్నారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ బాలూనాయక్, జడ్పీటీసీ పొడిశెట్టి కమలారామనాథం, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, వైస్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో మునవర్, జోగ్యతండా సర్పంచ్ ఆంగోత్ సరోజ, ఉపసర్పంచ్ శ్రీను, కార్యదర్శి ప్రవీణ, పీఎసీఎస్ వైస్ చైర్మన్ మన్మధ రావు, గొర్ల సత్తిరెడ్డి, తేజావత్ రాజు, విద్యాసాగర్, డీఎస్ కృష్ణ, వీరభద్రం, నందూలాల్, మోహన్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విధులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు..
చిన్నగూడూరు : విధుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్య లు తప్పవని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పద్మవెంకటరెడ్డి అధ్యక్షతన మండల సభ నిర్వహించగా రెడ్యా ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు, మేఘ్యాతండా, మంగోరిగూడెం, గుం డంరాజుపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు అందడంలేదంటూ స్థానిక ప్రజా ప్రతినిదులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, రెడ్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్, తదితర శా ఖల అధికారులు తమ తీరు మార్చుకోవాలన్నారు. అ నం తరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దన్నారు. మం డలంలోని చిన్నగూడూరు, జయ్యారం గ్రామాల్లో రెండు హెల్త్‌సబ్ సెంటర్లు మంజూరయ్యాయని స్థల సేకరణ పూర్తి చేసి నిర్మాణాలు చేట్టేలా సంబంధిత అధికారులు చూ డాలన్నారు. ఎంపీపీ పద్మావెంకటరెడ్డి, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీవో సరస్వతి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ మంగపతిరావ్, అధికారులు ఉన్నారు.
తాజావార్తలు
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
- ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని
- ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- వారం క్రితం కూలిన బంగారు గని.. సజీవంగానే కార్మికులు
- ఆధునిక టెక్నాలజీతోనే అధిక దిగుబడులు
- ఆటో బోల్తా..నలుగురికి గాయాలు..
- సురేందర్ రెడ్డికి పవన్ గ్రీన్ సిగ్నల్..!
- బెంగాల్లో మమతకు మద్దతిస్తాం: అఖిలేశ్