శనివారం 23 జనవరి 2021
Mahabubabad - Dec 03, 2020 , 02:07:08

టూరిజంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి

టూరిజంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి

  •   కలెక్టర్‌ గౌతమ్‌

మహబూబాబాద్‌  రూరల్‌  :  టూరిజంతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో  ఏకో టూరిజంపై గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. అడవి సంరక్షణతో పాటుగా ఆయా ప్రాంతాల్లో గిరిజన ప్రజల ఉపాధి కోసం చేపట్టే ఏకో టూరిజంకు మంచి అవకాశా లు ఉన్నాయన్నారు. కొత్తగూడలోని పాకాల చెరువు వద్ద ఏకో టూరిజం చేపట్టేందుకు అంచనాలు రూపొందించామన్నారు. కార్తీక మా సంలో వన భోజనాలకు వచ్చే పర్యాటకులకు  వసతి సౌకర్యాల ఏర్పాటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి హను మంతు, డీఎప్‌వో రవికిరణ్‌, విద్యా చందన, కొమురయ్య పాల్గొన్నారు.

గిరి వికాస పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి..

  గిరి వికాస పథకంతో గిరిజన ప్రజల ఆర్థిక ప్రగతి పెరుగుతుందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్‌ విపీ గౌతమ్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో గిరి వికాస పథకంపై ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారితో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. గిరి వికాస పథకం కింద 316 మంది దరఖాస్తులు చేసుకున్నారని అందులో 156 దరఖాస్తులు గ్రౌండ్‌ వాటర్‌ సర్వే జరిగిందన్నారు.  బోర్‌వెల్స్‌పై అటవీశాఖకు అభ్యంతరాలుంటే వెంటనే తెలియజేయాలన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల గిరిజన వికాస పథకంతో సస్యశ్యామలం కానున్నదని బోరు ఉండడంతో ఏ పంట లు అయినా వేసుకోవచ్చున్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రా జెక్ట్‌ అధికారి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


logo