శనివారం 16 జనవరి 2021
Mahabubabad - Dec 01, 2020 , 05:56:03

వైభవంగా కార్తీక పౌర్ణమి

వైభవంగా కార్తీక పౌర్ణమి

  • భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
  • సామూహిక సత్యనారాయణ వ్రతాలు
  •  కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు

మహబూబాబాద్‌  రూరల్‌ నవంబర్‌ 30  : మానుకోట పట్టణ కేంద్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు గురస్వామి నంబుద్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ 21వ సారి అయ్యప్ప మాలను ధరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి శానిటైజర్లను, మాస్కులను ధరించాలన్నారు. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ పా ల్వాయి రామ్మెహన్‌ రెడ్డి, కుమారుడు సూర్యచంద్ర, వ్యక్తిగత సహాయకుడు సతీష్‌ అయ్యప్ప మాలను ధరించారు.

కేసముద్రం: మండలంలోని కల్వల గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా సత్యనారాయణ వ్రతాలను పండితులు నాగయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పెరటి వెంకట్రామ నర్సయ్య, గంట బాలకృష్ణారెడ్డి, మూల వెంకట్‌రెడ్డి, ఆకుల సుశీల, పెరుమాండ్ల ఎల్లగౌడ్‌, కొమ్మాల వెంకట్‌రెడ్డి , శ్రీరాం రమేశ్‌ ఉన్నారు. 

గూడూరు: మండల కేంద్రంలోని శివాలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీకపౌర్ణమి దీపారాధనలు చేశారు. హిందూ ఉత్సవ సమితి, శివాంశ సమితి ఆధ్వర్యంలో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ సహస్ర లింగార్ఛన పూజలు జరిపారు. మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు.

బయ్యారం: మండలంలోని శివాలయంలో కార్తీక పూజ నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.  

గంగారం : కార్తీక పౌర్ణమి వేడుకలు పురష్కరించుకొని గం గారంలోని గంగమ్మ ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివలింగం చూట్టు దీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కోమట్లగూడెంలోని శివాలయంలో భక్తులు దీపాలతో అలంకరించి పూజలు చేశారు.  

డోర్నకల్‌: డోర్నకల్‌ శివారులో పంచముఖ లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వ హించారు.  అర్చకులు అఖండ జ్యోతి జ్వాలా తోరణం వెలి గించారు.  ఆలయ వ్యవస్థాపకుడు రత్నం కుటుంబ సభ్యు లు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 

గార్ల: కార్త్తీక పౌర్ణమి వేడుకలను మండల భక్తులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం కార్తిక పౌర్ణమి పర్వ దినోత్స వాన్ని పురస్కరిచుకొని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నా యకుడు పరుచూరి కుటుంబరావు దంపతులు స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ఆలయ ఆర్చకులు శేషు స్వామిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.  భక్తులు స్థానిక శివాలయంలో అభిషేకాలు జరిపించారు.  

 కురవి :  మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పౌర్ణమి సోమవారం కలిసిరావడంతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడ్డారు. మహిళ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తులసీ కోట వద్ద దీపాలను వెలిగించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ భక్తులకు  సౌకర్యాలు కల్పించారు. 

ముత్యాలమ్మ గుడికి శంకుస్థాపన

కురవి : మండలంలోని కాంపల్లిలో గ్రామదేవత ముత్యాలమ్మ గుడికి కార్తీక పౌర్ణమి శుభమూహూర్తాన్ని పురస్కరించుకొని సర్పంచ్‌ తోట శోభారాణి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పం చ్‌ మాట్లాడుతూ ఆలయ  స్థలదాత సుంకిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ నిర్మాణ దాత మహేశ్‌ను అభినందించారు.   శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ చంద్రయ్య, తోట రమేశ్‌, వెంకటేశ్వర్లు, వెంకన్న, సత్యం పాల్గొన్నారు.

కేసముద్రం: మండలంలోని అమినాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు ఎనిమిది వేల దీపాలను గుడి ఆవరణలో నామాల, శంఖం, చక్రం ఆకారంలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు.