సోమవారం 18 జనవరి 2021
Mahabubabad - Nov 30, 2020 , 03:28:54

మాస్కులు తప్పనిసరి

మాస్కులు తప్పనిసరి

డోర్నకల్‌, నవంబర్‌ 29: ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరి ధరించాలని, లేకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని సీఐ ఇస్లావత్‌ శ్రీనివాస్‌ సూచించారు. ఆదివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వు లు, పై అధికారుల ఆదేశానుసారంగా ఏలాంటి సమావేశాలు, సభలు, ఫం క్షన్లకు అనుమతులు లేవన్నారు. ఎటువంటి ఫంక్షన్లకు కూడా ప్రభుత్వ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఫంక్షన్లు, సమావేశాలు నిర్వహించిన వారిపై  చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా నిర్మూలించేందుకు ప్రజలందరు సహకరించాలన్నారు.

మహబూబాబాద్‌  రూరల్‌ : ప్రతి వాహనదారుడు తప్పని సరిగా మాస్కు ధరించాలని, లేకుంటే జరిమానా తప్పదని రూరల్‌ ఎస్సై రమేశ్‌ బాబు హె చ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని ఈదులపూసపల్లిలో కిరాణా దుకాణా యజమానుదారులకు, వాహనదారులకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై  మాట్లాడుతూ కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.