ఆదివారం 17 జనవరి 2021
Mahabubabad - Nov 29, 2020 , 02:58:35

రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌కు విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌కు విద్యార్థుల ఎంపిక

కురవి, నవంబర్‌ 28 : విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా ఆన్‌లైన్‌ కళాఉత్సవ్‌ పోటీల్లో మండలం కాంపల్లి, కొత్తూరు(సీ) వి ద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి, రాష్ట్ర స్థాయికి  ఎంపికయ్యారని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు లక్ష్మీనారాయణ, వరదరాజులు తెలిపారు. శనివా రం పాఠశాలల్లో ఎంపికైన విద్యార్థులను అభినం దించారు. కొత్తూరు(సీ) నుంచి పదో తరగతి చదు వుతున్న సందీప్‌, కాంపల్లి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ప్రియాంక ప్రతిభ చూపిన ట్లు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు.  ఇరువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే కళా ఉత్సవ్‌ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.