జిల్లాలో మోస్తరు వర్షం

మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావం తో మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు వర్షం రావడంతో స్థానిక రైతులు వరి, మక్కల పైన టార్పాలిన్లతో భద్రపరిచారు. తుఫాన్ ప్రభావం మరో రెం డు రోజులు పాటుగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన సలహాల మేరకే రైతులు వరి పంటలను కోయడం ఆపి చేసి పంటల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో సరాసరి వర్షపాతం 8.3 మిల్లీ మీటర్లు నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు. కొత్తగూడ 6.2 మిల్లీ మీటర్లు, బయ్యారంలో 7.2,గార్లలో 8.8, డోర్నకల్‌లో 14.8, కురవిలో 9.0, మానుకోటలో 8.2, గూడూరులో 4.8, కేసముద్రంలో 7.2, నెల్లికుదురులో 8.6, నర్సింహులపేట 9.1,మరిపెడలో 7.5, తొర్రూరులో 8.5 మిల్లీ మీటర్లు నమోదు అయినట్లు తెలిపారు.
కేసముద్రం: నిపర్ తుఫాన్ కారణంగా మండలంలో ముసురుతో కూడిన వర్షం కురిసింది. వానకాలంలో సాగు చేసిన వరి పంట చేతికి అంది వస్తుండడంతో రైతులు కొన్ని రోజుల నుంచి వరి కోతలను ప్రారంభించారు. వర్షం కారణంగా వరి మెదలు తడిసింది. కొనుగోల్ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచారు.
కొత్తగూడ: రెడు రోజులుగా అకాల వర్షం కురుస్తుండడంతో ఆ రుగాలం కష్టపడించిన పండించిన పంటలు నీళ్ల పాలయ్యాయి. దీంతో వరి, మక్కజొన్న పంటలు నేలవాలాయి.
తాజావార్తలు
- రాశీఖన్నాకు నో చెప్పిన గోపీచంద్..!
- పెద్దపల్లిలో 15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
- ఆమెకు నేను ఏ సాయం చేయలేదు: కమలాహారిస్ మేనమామ
- ఈ అజింక్య అజేయుడే.. రహానే ఓటమెరుగని రికార్డు
- బోయిన్పల్లి కిడ్నాప్ కేసు.. విచారణ వేగవంతం
- శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్‌గా 'పిట్టకథలు' టీజర్
- ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు
- చరిత్రలో ఈరోజు.. అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
- నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి పోటీ!
- బాత్రూమ్ కి వెళ్తే..ఉద్యోగం ఫట్