బుధవారం 27 జనవరి 2021
Mahabubabad - Nov 28, 2020 , 03:23:34

రైతులు ఆందోళన చెందవద్దు

రైతులు ఆందోళన చెందవద్దు

  • అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

మహబూబాబాద్‌  రూరల్‌ నవంబర్‌ 27 : అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందవద్దని, సాధ్యమైనంత వరకు ధా న్యాన్ని తడవ కుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్‌ వెం కటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌ కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులతో సమీక్షించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుపాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి పోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు టార్పాలిన్లు కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు. భద్ర పరిచిన ధాన్యాన్ని కూడా రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. జిల్లాలో 192 కేంద్రాలకు గాను 118 కేంద్రాలు ప్రారంభించి 3177 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలల్లో మాయిశ్చర్‌ మీటరు,్ల వేయింగ్‌ మిషన్లు గన్ని బ్యాగ్స్‌, టార్పాలిన్‌ కవర్ల  కొరత లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. రైతులు దళారుల మాటలు నమ్మ వద్దన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ అధికారి ఛతృ నాయక్‌, పౌరసఫరాల అధికారి నర్సింగ్‌ రావు, విద్యా చందన, మురళీరమణ, మహేందర్‌, తదితరులు ఉన్నారు.

తుపాన్‌ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

   జిల్లా  వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న  వర్షాలకు ప్రజ లు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నదని ప్రభు త్వ అధికారులు చూపిన జాగ్రత్తలు ప్రజలు పాటించాలన్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి తీవ్ర చలి ఉన్నందున పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లవద్దని, శిథిలావస్థలో ఉన్న నివాసంలో ఉండడం ప్రమాదమన్నారు. వర్షాల దృష్ట్యా వ్యాధుల వ్యాప్తి చెందకుండా శుభ్రత పాటించాలన్నారు. రైతులు పంటలను సంరక్షించుకోవాలని అత్యవసర సమయంలో సహాయం పొందుటకు వందకు డయల్‌ చేయాలని సూచించారు. స్థానిక పోలీసులు ప్రజలకు అం దుబాటులో ఉండాలని ఆదేశించారు. logo