సోమవారం 18 జనవరి 2021
Mahabubabad - Nov 27, 2020 , 01:23:43

సార్వత్రిక సమ్మె విజయవంతం

సార్వత్రిక సమ్మె విజయవంతం

  • పట్టణ కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

మహబూబాబాద్‌ రూరల్‌ : రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలందరూ ఏకమై ఎండగట్టాలని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా నాయకుడు మంగళపల్లి రాజ్‌కుమార్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీ అజయ్‌ కుమార్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెక్రసీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రయ్య డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణ కేంద్రంలో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ మదర్‌ థెరిసా సెంటర్‌ నుంచి నెహ్రూనగర్‌, ఇందిరా సెంటర్‌, తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోఢీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడం తీవ్రతరం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు రకాల రైతు వ్యతిరేక బిల్లుల వల్ల తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. రాబోయే కాలంలో ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూర్ణపు సోమయ్య, రాజన్న, రాజమౌళి, నాగన్న, రామ్మూర్తి, పెరుగుకుమార్‌, రేషపల్లి నవీన్‌, చింతకుంట్ల వెంకన్న, లింగన్న, మండల వెంకన్న, శ్రీరాములు, బోగా రవిచంద్ర, దేవేందర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గార్ల: కార్మికులపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె మండలంలో ప్రశాంతంగా ముగిసింది.  తొలుత స్థానిక నెహ్రూ కూడలికి చేరుకొని పుర వీధుల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వెతి రేకిస్తూ నినాధాలు చేశారు. అనంతరం ఆయా పార్టీలకు చెందిన నా యకులు శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రావు, రామారావు, సత్యం, సత్య నా రాయణ, సకృ, వెంకన్న , రామారావు మాట్లాడారు. కార్మికుల సమ స్యలు కేంద్రం పట్టించుకోకపోవడంపై దుమ్మోత్తి పోశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, ఎన్డీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పాల్గొన్నారు.  

  డోర్నకల్‌: మండల కేంద్రంలో దుకాణాలు, చిరువ్యాపారుల సమ్మెకు పూర్తి మద్దతు తెలిపారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శెట్టి వెంకన్న, సీపీఎం నాయకులు వెంకటరెడ్డి, ఉప్పెనపల్లి శ్రీనివాస్‌, మల్లేశం,వెంకన్న ఉన్నారు.

కేసముద్రం: కార్మికులను బానిసలుగా మార్చితే సహించేది లేదని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ, సీఐటీ యూ, ఐఎఫ్‌టీయూ, ఏఐసీటీయూ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో కంచ వెంకన్న, శివ్వా రపు శ్రీధర్‌, మంద భాస్కర్‌, కన్మంతరెడ్డి భాస్కర్‌రెడ్డి, మర్రిపల్లి మొగిలి , బొబ్బాల యాకుబ్‌రెడ్డి, బొమ్మనబొయిన అనసూర్య తదితరులు ఉన్నారు.

కురవి: మండల కేంద్రంలోని వామపక్ష పార్టీల నాయకులు నల్లు సుధాకర్‌రెడ్డి, గంధసిరి శ్రీనివాస్‌, సామ పాపయ్య, నక్కసైదులు, బీమానాయక్‌ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. గ్రామపంచాయతీ నుంచి గుడిసెంటర్‌ మీదుగా 365 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  ఉపేందర్‌, పోతుగంటి మల్లయ్య, కర్నం రాజన్న, తురక రమేశ్‌, వెంకన్న, అనిల్‌, వెంకన్న, విజయ్‌, సుధాకర్‌, కృష్ణయ్య పాల్గొన్నారు