బుధవారం 20 జనవరి 2021
Mahabubabad - Nov 27, 2020 , 01:18:28

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

 ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

మహబూబాబాద్‌  రూరల్‌ : జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్లలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పోలీస్‌ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏఆర్‌ డీఎస్పీ జనార్దన్‌ రెడ్డి, ఆర్‌ఐ నరసయ్య, లాల్‌బాబు ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌ అం బేద్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.    

మనువాదుల నుంచి బారత రాజ్యాంగం కాపాడుకోవాలి

  మనువాదుల కోరల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపా డు కోవాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐలయ్య, దార కుమా ర్‌, రమేశ్‌ , భరత్‌, హరీశ్‌, తిరుపతి పాల్గొన్నారు.

దళితులకు సామాజిక న్యాయం అందించాలి

  దళితులకు సామాజిన న్యాయం అందేలా అధికారులు చూడాలని ఎస్సీ,ఎస్టీ మానిరటరింగ్‌ జిల్లా కమిటీ నాయకులు,దళాత రత్న కామ సంజీవరావు అన్నారు.  పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్‌ యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తప్పెట్ల వీరన్న, గుగులోతు కిషన్‌ నాయక్‌, ముత్తదొర, గుంజే హనుమంతు, చందు, రవీందర్‌, వెంకన్న, గాందీ పాల్గొన్నారు.

కొత్తగూడ: జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు భారత రా జ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని యాజమాన్య పాఠశాలలో ఉపాధ్యాయులు, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొగుళ్లపల్లి ఇన్‌చార్జి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమన్‌, ఉపాధ్యాయలు రాణి, సుమలత, పుష్పలీల, సారంగపాణి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 కురవి : మండలంలోని కాంపల్లి ఉన్నత పాఠశాలలో   అంబేద్కర్‌ చిత్ర పట్టానికి జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ పూలమాల వేసి నివాళులర్పించారు.  హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, సీఆర్పీ నవీన్‌, కృష్ణాకర్‌, భిక్షపతి, మంజు ల, నూర్జహాన్‌, సురేశ్‌, సంధ్యారాణి తదితరులున్నారు.  

గూడూరు : మండల కేంద్రంలో మండల మాలమహానా డు, టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి ఘనం గా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు చీదురు వెంకన్న, మాలమహానాడు మండలాధ్యక్షుడు బెజ్జం రమేశ్‌, రహీం, టీబీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా సురేశ్‌ నాయక్‌, నాయకులు తవ్వల జయపాల్‌, బోడ ఎల్లయ్య, విజయ్‌, రవి, రాజారాం, అనిల్‌, అంతయ్య పాల్గొన్నారు.

గార్ల: మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లోని అంబేద్కర్‌ విగ్రాహానికి పూల మాలలు వేసి,  నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పోలీసులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు.

గంగారం: మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో శ్యాంసుందర్‌ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఈర్పసూరయ్య, సమ్మయ్య. సారక్క, వెంకటలక్ష్మి, కార్యదర్శులు నరేశ్‌, స్వరూప పాల్గొన్నారు.

డోర్నకల్‌: రాజ్యాంగ 71వ దినోత్సవం పురష్కరించుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సీఐ ఇస్లావత్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ భద్రునాయక్‌, ప్రభాకర్‌,వీరన్న,తదితరులు పాల్గొన్నారు.logo