సోమవారం 25 జనవరి 2021
Mahabubabad - Nov 26, 2020 , 02:07:04

బాలికపై అఘాయిత్యం

బాలికపై అఘాయిత్యం

  • బెదిరించి లొంగదీసుకున్న బాబాయి వరుస వ్యక్తి
  • ఆరు నెలలకు వెలుగులోకి..   
  • గర్భం దాల్చిన బాధితురాలు
  •  నిందితుడిపై పోక్సో కేసు నమోదు

కురవి: బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో గర్భం దాల్చిన సంఘటన కురవి మండలంలోని కొత్తూరు(జీ) శివారు ఓ తండాలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా బాబాయి వరుస అయ్యే వ్యక్తి ఈ ఘటనకు కారణమని తేలింది. కురవి పోలీసులు నిందితుడిపై  పోక్సో కేసు నమోదు చేసారు. చైల్డ్‌లైన్‌ ప్రతినిధుల కథనం ప్రకారం.. తండాకు చెందిన 13 ఏళ్ల బాలికపై అదే తండాకు చెందిన బాబాయి వరుసయ్యే వ్యక్తి ఆరునెలల క్రితం నుంచి భయ పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక  గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు మంగళ వారం మానుకోటలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా వైద్యులు ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్ల్లాలని సూచించారు. అక్కడ చికిత్స చేస్తుండగా విషయం తెలు సుకున్న బాల రక్షాబంధన్‌ కోఆర్డినేటర్‌ జ్యోతి, బాలల పరిరక్షణ అధికారి పుట్ట కమలాకర్‌ వెంటనే బాలికను సంరక్షించారు.

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి బాలికను చైల్డ్‌లైన్‌ ద్వారా వరంగల్‌లోని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరు పరిచారు. బాలల సంక్షేమ సమితి చైర్మన్‌ మండల పరశురాములు ఆదేశాల మేరకు బాలికకు రక్షణ కల్పించారు. బాలల సంరక్షణ అధికారులు వీరన్న, నరేశ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వహిదా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి బుధవారం కురవి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కురవి ఎస్సై శంకర్‌రావు వివరించారు.


logo