సోమవారం 18 జనవరి 2021
Mahabubabad - Nov 24, 2020 , 03:29:16

18 కిలోల గంజాయి స్వాధీనం

18 కిలోల గంజాయి స్వాధీనం

మహబూబాబాద్‌ రూరల్‌ : మండల శివారులో 18 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.మానుకోట టాస్క్‌ఫోర్స్‌ సీఐ కృష్ఱ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని బోడగుట్ట తండాలో అజ్మీరా వెంకన్న ఇంట్లో తనిఖీలు చేయగా, 18 కిలోల ఎండు గంజాయి లభించింది. నిందితుడు వెంకన్న పరారీలో ఉండగా, గంజాయిని స్వాధీనం చేసుకుని వెంకన్నపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.