శనివారం 28 నవంబర్ 2020
Mahabubabad - Nov 22, 2020 , 02:16:01

భక్తులు సహకరించాలి

భక్తులు సహకరించాలి

  •  ఆర్డీవో కొంరయ్య
  •  కొవిడ్‌-19 దృష్ట్యా ఈనెల 30న కందికొండ జాతర రద్దు

కురవి, నవంబర్‌ 21: కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన నిర్వహించే కందికొండ జాతరను రద్దు చేస్తున్నట్లు, భక్తులు సహకరించాలని  ఆర్డీవో కొంరయ్య కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ కొవిడ్‌ రోజురోజూకు విజృంభిస్తుందని, ఒకే ప్రదేశంలో సామూహికంగా నిర్వహించే జాతరలలో కరోనా వైరస్‌ మరింత ప్రభా వం చూపే అవకాశం ఉందని వివరించారు.   కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారంగా పోలీసుల సహకారంతో భక్తులను కందికొండ గుట్టమీద కు అనుమతించేది లేదన్నారు. గుట్ట వద్దకు చేరుకునే దారులన్నింటిని బారికెడ్ల సహాయంతో మూసి వేయనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు  సహకరించాలని కోరారు. ఎంపీడీవో ధన్‌సింగ్‌, ఎంపీవో విజయలక్ష్మి, కందికొండ సర్పంచ్‌ వడ్డూరి పద్మ, కందికొండ  ఎంపీటీసీ అడిదెల దేవేందర్‌  తదితరులు పాల్గొన్నారు.