గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubabad - Nov 22, 2020 , 01:37:46

గంజాయి స్మగ్లర్‌ అరెస్ట్‌

గంజాయి స్మగ్లర్‌ అరెస్ట్‌

గూడూరు: ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్సై సురేశ్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పాకాలవాగు సమీపంలో శనివారం పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ క్ర మంలో మహబూబాబాద్‌ రూరల్‌ మండలం జ మాండ్లపల్లి చెందిన పాక అశోక్‌ బైక్‌పై గంజాయి అక్రమంగా తరలిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించారు. ఒడిశా రాష్ట్రంలోని చింతూర్‌ నుంచి గంజాయి తెప్పించి అమ్ముతున్నట్లు అంగీకరించా డు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని అశోక్‌ను తహసీల్దార్‌ శైలజ ఎదుట బైండోవర్‌ చేశారు. గం జాయి విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని ఎస్సై తెలిపాడు. మహబూబాబాద్‌ పోలీసులు గతం లో గంజాయి పట్టుకున్న కేసులో కూడా అశోక్‌ నిందితుడని చెప్పాడు.