ఆదివారం 29 నవంబర్ 2020
Mahabubabad - Oct 29, 2020 , 02:03:31

ఆశీర్వదిస్తూ... పరామర్శిస్తూ..

ఆశీర్వదిస్తూ... పరామర్శిస్తూ..

మరిపెడ, అక్టోబర్‌ 28: బాధిత కుటుంబాన్ని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ బుధవారం పరామర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన జయంత్‌రెడ్డి కుటుంబసభ్యులను రెడ్యా కలిసి పరామర్శించారు. అనంతరం మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మరిపెడ మాజీ కో ఆప్షన్‌ సభ్యు డు ఎండీ ఆయూబ్‌ ఉన్నారు.

పట్టణాధ్యక్షుడికి ఎమ్మెల్యే ఆశీర్వచనం

చిన్నగూడూరు: టీఆర్‌ఎస్‌ డోర్నకల్‌ పట్టణాధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మండలంలోని ఉగ్గంపల్లిలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. అదేవిధంగా మహబూబాబాద్‌ సమైక్య విద్యాసంస్థల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ అడ్డగోడ నరేశ్‌  ఎమ్మెల్యేను కలువగా ఆయనను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. 

వధూవరులకు రవిచంద్ర ఆశీర్వాదం

మరిపెడ : డోర్నకల్‌ టీఆర్‌ఎస్‌ యువనేత డీఎస్‌ రవిచంద్ర నూతన వధూవరులను ఆశీర్వదించారు. మండలంలోని ఎల్లంపేటకు చెందిన చెన్నబోయిన మురళి-రాములమ్మ దంపతుల కుమారుడు వెంకటేశ్‌కు భవానీతో నిశ్చితార్థమవగా రవిచంద్ర హాజరయ్యారు. నూతన దంపతులను అభినందించారు. ఆయన వెంట సర్పంచ్‌ శ్రీనివాస్‌,  టీఆర్‌ఎస్‌ నాయకులు కిశోర్‌, గండి వెంకటేశ్‌, చిన్నగూడూరు మండల టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు మురళి ఉన్నారు.