సోమవారం 30 నవంబర్ 2020
Mahabubabad - Oct 29, 2020 , 02:03:52

పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూ...

పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూ...

  • నర్సింహులపేటలో మూత్రశాలల నిర్మాణం 
  • పంచాయతీ పనితీరును అభినందిస్తున్న గ్రామస్తులు

నర్సింహులపేట, అక్టోబర్‌ 28: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటి ఆవరణలో తప్పని సరిగా మరుగుదొడ్డి నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయం,  అంగడికి వచ్చే ప్రజలకు పబ్లిక్‌ టాయిలెట్లు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని నర్సింహులపేట గ్రామ పంచాయతీ నిధుల నుంచి పురుషులకు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్డి, మూత్రశాల ఏర్పాటు చేశారు. దీనిని త్వరలో ప్రారభించి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని సర్పంచ్‌ వేముల రజితారెడ్డి తెలిపారు.