సోమవారం 30 నవంబర్ 2020
Mahabubabad - Oct 27, 2020 , 00:57:23

వీరన్న సన్నిధిలో ఎంపీ కవిత పూజలు

వీరన్న సన్నిధిలో ఎంపీ కవిత పూజలు

కురవి : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో ఎంపీ మాలోత్‌ కవితా భద్రూనాయక్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు హరితాప్రవీణ్‌కుమార్‌  ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సత్యనారాయణ వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ బాదావత్‌ రాజూనాయక్‌, ఎంపీటీసీ చిన్న భాస్కర్‌, నర్సింహారావు, మండల ఉపాధ్యక్షుడు దైద భద్రయ్య, గ్రామ అధ్యక్షుడు తుకారాంనాయక్‌, నాగిరెడ్డి, వెంకన్న, రైతు బంధ సమితి గ్రామ కో ఆర్డినేటర్‌ వీరన్న, జాగృతి రాష్ట్ర నాయకులు హర్షిత్‌వర్మ, రాజేశ్‌, సత్యనారాయణ, బండారి రమేశ్‌ పాల్గొన్నారు.

నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్‌

మహబూబాబాద్‌ రూరల్‌: సీఎం కేసీఆర్‌ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆరుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ పాషా, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పర్కాల శ్రీనివాస్‌ రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్‌ పాల్గొన్నారు. 

పాఠశాలకు బెంచీల బహూకరణ 

గంగారం : మండలంలోని మడగూడ ఆశ్రమ పాఠశాల 2002-2003 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన కొందరు  స్నేహితులు ఉపాధ్యాయలతో కలిసి పాఠశాలకు, గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసేందుకు బెంచీలను బహూకరించారు. వారిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జంపయ్య, నాగేశ్వరావు, చుంచ బాబు, మోకాల బాబు, శ్రీరాములు పాల్గొన్నారు.