శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mahabubabad - Oct 27, 2020 , 00:57:23

రైతుల కోసమే సహకార సంఘాలు

రైతుల కోసమే సహకార  సంఘాలు

జడ్పీ చైర్‌పర్సన్‌ బిందు

బయ్యారం: రైతుల అభివృద్ధి కోసమే సహకార సంఘాలు సేవలందిస్తున్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ నా గభూషణం అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో క్యాష్‌కౌంటర్‌ను ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. సహకార సంఘం ద్వారా రైతులకు వివిధ రకా ల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. క్యాష్‌కౌంటర్‌ ద్వారా డిపాజిట్లు, సేవింగ్‌ ఖాతాలు, బంగారు ఆభరణాల తాక ట్టు వంటి సదుపాయం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్‌ కోటేశ్వరరావు, సురేందర్‌, డైరెక్టర్లు నాగమణి, మల్ల య్య,శ్రీనివాస్‌, మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సేవా భావాన్ని అలవర్చు కోవాలి

ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అవర్చుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోత్‌ బిందు అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో జిల్లాపరిషత్‌ పాఠశాల పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో ప్రయాణికులకోసం బస్‌షెల్టర్‌ ఏర్పాటు చేయ గా, ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. చదువుకు న్న పాఠశాల, పుట్టిన ఊరును గుర్తు పెట్టుకొని సేవ చే యడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ తాత గణేశ్‌, సొసైటీ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, సర్పంచ్‌ కోటమ్మ, రమేశ్‌, ఎంపీటీసీ కుమారి, శైలజారెడ్డి,  విశ్రాంత ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, ఆర్వీప్రసాద్‌రావు, పూర్వ విద్యార్థులు శివరాం, పుల్లంరాజు, భద్రయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ 

మండలంలోని గౌరారం గ్రామ ఉప సర్పంచ్‌ మహేశ్వరి భర్త శ్రీను ఇటీవల పిడుగుపాటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ బిందు పరామర్శించారు. ఆమె వెంట ఎంపీపీ చేపూరి మౌనిక, మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఎంపీటీసీ భద్రయ్య, సర్పంచ్‌ వెంకన్న, నాయకులు ఉన్నారు.