బుధవారం 02 డిసెంబర్ 2020
Mahabubabad - Oct 27, 2020 , 00:57:22

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు

ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

చెరువుల్లో నిమజ్జనం

కురవి : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహాన్ని ఆలయ అధికారులు కురవి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ముందుగా అర్చకులు పూజలు నిర్వహించి, అమ్మవారి విగ్రహానికి ఉద్వాసన పలికారు. అనంతరం సిబ్బంది విగ్రహాన్ని గుడిచుట్టూ తిప్పి, పెద్ద చెరువు వద్దకు తీసుకువెల్లి నిమజ్జనం చేశారు.

కేసమ్రుదం: మండలంలోని కేసముద్రం స్టేషన్‌, కల్వల , ఇంటికన్నే, అర్పనపల్లి, ఉప్పరపల్లి, ఇనుగుర్తి గ్రామాల్లో సోమవారం దుర్గాదేవి శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించారు. వివిధ రూపాల్లో దుర్గామాతకు 9రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఈ యాత్రలో భక్త మండలి సభ్యులు చిలంచర్ల సంతీశ్‌, వోమ సంతోశ్‌, మాలె ర వి, శ్రీరాం చంద్రన్‌కుమార్‌, మడూరి దినేశ్‌, సంతోశ్‌ పాల్గొన్నారు.

నెల్లికుదురు: మండలకేంద్రంతోపాటు పలుగ్రామాల్లో శరన్నవరాత్రు లు ముగిశాయి. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాలకు 9రోజులపాటు పూజలు నిర్వహించిన అనంతరం చివరి రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు. 

నర్సింహులపేట: మండలంలోని నర్సింహులపేట, పెద్దనాగారం, కొమ్ములవంచ గ్రామాల్లో ప్రతిష్ఠిం చిన దుర్గామాత విగ్రహాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు.

పెద్దవంగర: మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయంలో ఆదివా రం జడ్పీటీసీ శ్రీరాం జ్యోతిర్మయి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత వేద పండితులు పెద్దన్నశర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం, నవగ్రహ పూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధీర్‌కుమార్‌, వెంకన్న, అనుదీప్‌ పాల్గొన్నారు.


మానుకోట పట్టణంలో

మహబూబాబాద్‌ రూరల్‌: పట్టణంలో తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహాలను చివరి రోజు సోమవారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. నెహ్రూసెంటర్‌, ఇందిరానగర్‌ కాలనీ, రామచంద్రపురం కాలనీల నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి నిజాం చెరువులో నిమజ్జనం చేశారు.