గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubabad - Oct 25, 2020 , 02:14:57

ప్రియుడి ఇంటి ఎదుట మౌనపోరాటం

ప్రియుడి ఇంటి ఎదుట మౌనపోరాటం

కురవి : ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్యాతండా పంచాయతీ పరిధిలో శనివారం బైఠాయించింది. బాధితురాలు లోకిని మమత తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలానికి చెందిన మమత, తాట్యాతండాకు చెందిన భూక్య రవి పదేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అడిగితే రవి ముఖం చాటేశాడు. మోసపోయానని తెలిసి 2019, జూలై 23న హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రిమాండ్‌కు వెళ్లిన రవి అదే సమయంలో తనకు వచ్చిన ఉద్యోగంతో మంగపేట ఫారెస్ట్‌ బీట్‌ అధికారిగా విధుల్లో చేరి ముఖం చాటేసుకుంటూ తిరుగుతున్నాడు. దీంతో మమత వరంగల్‌ అర్బన్‌ డీఎఫ్‌వోకు 2019 డిసెంబర్‌ 4న, ములుగు డీఎఫ్‌వోకు 2020, జూన్‌ 13న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. న్యాయం జరగకపోవడంతో 2020 ఆగస్టు 25న మంగపేట రేంజ్‌ కార్యాలయం ఎదుట మౌనపోరాటం చేసింది. అయిన ఫలితం లేకపోవడంతో శనివారం తట్యాతండాలోని రవి ఇంటి ఎదుట మౌనపోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానని పేర్కొంది.