బుధవారం 25 నవంబర్ 2020
Mahabubabad - Oct 25, 2020 , 02:15:12

ఆడబిడ్డలు అభినందనీయులు

ఆడబిడ్డలు అభినందనీయులు

  • మంత్రి ఈటల రాజేందర్‌ 

కమలాపూర్‌ : ప్రభుత్వ ఆదేశాలు పాటించి ప్రజలు ఎక్కడిక్కడ బతుకమ్మ ఆడుకోవడం అభినందనీయులని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం కమలాపూర్‌లో బతుకమ్మ వేడుకలకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది తెలంగాణలో బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకునేదన్నారు. కరోనా వైరస్‌తో ప్రజల్లో పండుగ సంతోషం లేకుండా పోయిందని,  ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎవరి ఇంటి వద్ద వారే ఆడుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ తడక రాణి, ఈటల భద్రయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.