సోమవారం 25 జనవరి 2021
Mahabubabad - Oct 23, 2020 , 02:44:16

నీటి పారుదల పనులు సకాలంలో పూర్తి చేయాలి

నీటి పారుదల పనులు సకాలంలో పూర్తి చేయాలి

  • సమీక్షలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : నీటి పారుదల శాఖ పనులను సకాలం లో పూర్తి చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. గు రువారం కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్‌ అధికారుల తో సమీక్ష నిర్వహించా రు. 2020 మార్చిలో  మహబూబాబాద్‌, బయ్యారం, గార్ల మండలాల్లో మున్నేరు వాగుపై 41 చెక్‌డ్యాంలను నిర్మించామని, కరోనా వల్ల ప్రారంభించలేకపోయామని నీటి పారుదల శాఖ ఈఈ రాధాకిషన్‌రావు కలెక్టర్‌కు వివరించారు. 2021 మార్చిలో వాటిని ప్రారంభించాలని కలెక్టర్‌ వారిని ఆదేశించారు. డోర్నకల్‌ మండలం పాత దుబ్బగూడెం వద్ద ఆకేరు వాగుపై నిర్మించి చెక్‌డ్యాం పనులు 35 శాతం పెండింగ్‌లో ఉన్నాయని, బంజరలో ఎస్సారెస్పీ నీరు నిలుపుదల చేయగానే పనులు పూర్తి చేస్తామన్నారు. గూడూరు మండలం నుంచి కేసముద్రం కంబాలపల్లి, బయ్యారం రూ.5కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యాం పనులు ఆమోదం పొందాల్సి ఉందని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈలు, డీఈలు, ఈఈలు పాల్గొన్నారు. logo