శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mahabubabad - Oct 23, 2020 , 02:02:58

ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం

ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం

  •  ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌
  •  కేసముద్రం మండలకేంద్రంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై ఎల్‌ఈడీ లైట్ల పరిశీలన

కేసముద్రం: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నా రు. గురువారం ఆయన మండల కేంద్రంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నదన్నారు.  ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్‌లు ముందుండాలన్నారు. ఆ యన వెంట ఎంపీపీ చంద్రమోహన్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మాదరపు సత్యనారాయణ, స ర్పంచ్‌ బట్టు శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్‌, నాయకులు వీరూనాయక్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

నాయిని మృతికి సంతాపం 

మహబూబాబాద్‌ రూరల్‌: తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మృతికి గురువారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నా యిని నర్సింహారెడ్డి మృతి తెలంగాణకు తీరని లోటన్నా రు. కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని, నిరంత రం పేద ప్రజలకు అండగా ఉన్నాడని అన్నారు. నాయి ని ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు.