శనివారం 16 జనవరి 2021
Mahabubabad - Oct 22, 2020 , 01:50:26

ఎర్రబెల్లిగూడెం సర్పంచ్‌ సస్పెన్షన్‌

ఎర్రబెల్లిగూడెం సర్పంచ్‌ సస్పెన్షన్‌

నెల్లికుదురు, అక్టోబర్‌ 21 :రైతు వేదిక నిర్మాణంలో అలసత్యం వహించడమే కాకుండా ఇచ్చిన షోకాజు నోటీసులకు సంజాయిసీ ఇవ్వకపోవడంతో ఎర్రబెల్లిగూడెం సర్పంచ్‌ బొమ్మర అశోక్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీవో పార్థసారధి తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఆయన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రైతు వేదిక పనుల్లో అలసత్యం వహిస్తున్న క్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం, 2018లోని సెక్షన్‌ 37(5) ప్రకారం కలెక్టర్‌ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు నిబంధనల ప్రకారం రెండు రోజుల్లో సర్పంచ్‌ సంజాయిసీ ఇవ్వలేదన్నారు. కలెక్టర్‌ ఈ నెల 20న ఎర్రబెల్లిగూడెం గ్రామంలో సందర్శించిన క్రమంలో రైతువేదిక నిర్మాణం పురోగతి సాధించనట్లు గమనించారు. సర్పంచ్‌ను పెండింగ్‌ విచారణ కింద 6 నెలల పాటు తాత్కాలికంగా తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.