బుధవారం 02 డిసెంబర్ 2020
Mahabubabad - Oct 21, 2020 , 01:56:39

పోలీస్‌ అమరులను స్మరించుకుందాం..

పోలీస్‌ అమరులను స్మరించుకుందాం..

  • నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు
  • స్తూపం వద్ద పరేడ్‌తో ఫ్లాగ్‌డే ప్రారంభం
  • ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ ప్రమోద్‌కుమార్‌ పిలుపు

వరంగల్‌ క్రైం : శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులను స్మరిస్తూ ఫ్లాగ్‌డే పేరిట అమరవీరుల సంస్మరణ వార్సోతవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ కమిషనరేట్‌లోలోని అమరులవీరుల స్తూపం వద్ద బుధవారం ఉదయం స్మృతి పరేడ్‌తో వారోత్సవాలు ప్రారంభించనున్నట్లు సీపీ ప్రమోద్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 64మంది అమరవీరుల ను స్మరించుకోవాల్సిన బాధ్యత జిల్లా పొలీస్‌ అధికారులతో పాటు ప్రజలపై ఉందని పేర్కొన్నారు. పోలీసుల పనితీరుపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కమిషనరేట్‌ పరిధిలో ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తద్వారా విధి నిర్వహణలో పోలీసులు వినియోగించే ఆయుధాల తో పాటు బాంబు డిస్పోజల్‌, క్లూస్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, డాగ్‌స్కాడ్‌ పనితీరును వివరించనున్నట్లు తెలిపారు. పో లీసుల ప్రతిభపై విద్యార్థులకు, పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు, లఘుచిత్రాలు, ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయని మొదటి మూడు స్థానాల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. అలాగే డివిజన్‌ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి, పోలీస్‌ అమరవీరుల కుటుంబాలు, పోలీస్‌ అధికారులు, సిబ్బందితో కొవ్వొత్తి ర్యాలీ ని ర్వహించనున్నట్లు తెలిపారు. కమిషనరేట్‌ పోలీసులు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.