బుధవారం 25 నవంబర్ 2020
Mahabubabad - Oct 19, 2020 , 05:20:05

లెట్రిన్‌ గుంతలో పడి బాలుడి మృతి

లెట్రిన్‌ గుంతలో పడి బాలుడి మృతి

  • స్టేషన్‌ గుండ్రాతిమడుగులో విషాదం

కురవి: లెట్రిన్‌ గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం రాత్రి మం డలంలోని స్టేషన్‌ గుండ్రాతిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నల్ల గోపి, శైలజ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బగ్గు(మూడేళ్లు) సాయం త్రం ఆటలాడుకుంటూ లెట్రిన్‌ గుంతలో పడిపోయాడు. ఎవరూ చూడకపోవడంతో మృతిచెందా డు. రాత్రైనా కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టపక్కల వెతికారు. చివరికి లెట్రిన్‌ గుంతలో మృతిచెంది కనిపించాడు. దీంతో ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి.