మంగళవారం 27 అక్టోబర్ 2020
Mahabubabad - Oct 18, 2020 , 04:49:10

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి..

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి..

  •  డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యానాయక్‌
  • 7వ వార్డు కౌన్సిలర్‌ అరుణతో పాటు 50 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరిక

డోర్నకల్‌, అక్టోబర్‌ 17 : అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యా నా యక్‌ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్‌ అరుణ - మధు దంపతులతో పాటు 50 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి. అంబేద్క ర్‌, బుద్ధుడి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడు తూ.. మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపాలిటీకి వచ్చి న రూ. 20 కోట్లతో పాటు మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి మరో రూ. 5 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఎస్సీ క మ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి కేటాయించిన రూ. 40 లక్షలకుతోడు రూ. 10 లక్షలు తన ఎమ్మెల్యే కోటా నుంచి ఇస్తానని హామీనిచ్చారు. మోడల్‌ మార్కెట్‌ నిర్మాణ పనులకు ప్రజలందరూ సహకరించాలన్నారు. అనంతరం ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న, వైస్‌ చైర్మన్‌ కేశబోయిన కోటిలింగం, ఎంపీపీ ధరంసోత్‌ బాలు నాయక్‌, జడ్పీటీసీ పొడిశెట్టి కమ ల,  టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్‌, కౌన్సిలర్లు పోటు జనార్దన్‌, సురేందర్‌జైన్‌, బాసిక అశోక్‌, శరత్‌ బా బు, టీఆర్‌ఎస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్త రాంబాబు, పట్టణ ఉపాధ్యక్షుడు మాద రాజేందర్‌ప్రసాద్‌, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులు రాంభద్రం, మియా, రోడా, టీఆర్‌ఎస్‌ నాయకులు పోకల శేఖర్‌, వీరన్న, యశోధర్‌జైన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo