శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mahabubabad - Oct 17, 2020 , 02:36:37

ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : సత్యవతి

ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : సత్యవతి

  • మంత్రి సత్యవతి రాథోడ్‌
  • మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు 

డోర్నకల్‌, అక్టోబర్‌ 16 : రైతలు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం డోర్నకల్‌ మున్సిపాలిటీలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియంత్రిత సాగుతో రైతులకు మేలు జరుగుతుంద న్నారు. దేశవ్యాప్తంగా 50 లక్షల టన్నుల మక్కజొన్నలు నిల్వ ఉన్నాయని, మళ్లీ వాటిని పండిస్తే గిట్టుబాటు ధర రాదని, చిరు ధాన్యాలు పండించుకోవాలన్నారు. మున్సిపాలిటీలో ఇంటింటి సర్వేపై ఇన్‌చార్జి కమిషనర్‌ను వెంకటేశ్వర్లు అడిగి తెలుకున్నారు. పట్టభద్రులతో ఓటు నమోదు చేయించాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సూచించారు. డోర్నకల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన భర్త ఇక్కడే రైల్వే ఉద్యోగం చేశారన్నారు. రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైందన్నారు. డోర్నకల్‌ ప్రజలు తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ఈ ప్రాంతం ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో మంత్రినయ్యాయని, ఈ ప్రాంతం అభివృద్ధిపై మరింత బాధ్యత పెరిగిందన్నా రు. తెలంగాణ ఆడబిడ్డలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 


logo