బుధవారం 25 నవంబర్ 2020
Mahabubabad - Oct 05, 2020 , 06:01:07

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

ఏటూరునాగారం : మండల కేంద్రంలోని నందమూరి నగర్‌కు చెందిన సంగం రాజయ్య(55) కరోనా సోకగా తగ్గుతుందో, లేదోనన్న భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్యాం తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 24వ తేదీన రాజయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్‌ వచ్చింది. దీంతో అందరూ హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. కాగా, సోమవారం తిరిగి పరీక్షలు చేయించుకోవాల్సి ఉన్నది. అయితే కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా రాజయ్య వరండాలో ఆదివారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా తగ్గుతుందో, లేదో అన్న భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.