శనివారం 05 డిసెంబర్ 2020
Mahabubabad - Sep 29, 2020 , 06:19:08

అంతకు మి(ర్చి)ంచి..

అంతకు మి(ర్చి)ంచి..

  • మహబూబాబాద్‌ జిల్లాలో అంచనాలు దాటి సాగు
  • గతేడాది 36,221 ఎకరాల్లోనే
  • ఈ ఏడాది 44,712 ఎకరాల్లో పంట 

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : మహబూబాబాద్‌ జిల్లాలో మిర్చి సాగు గత రెండేళ్లుగా పెరిగింది. 2019లో 34వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనావేయగా 36,221 ఎకరాల్లో రైతులు పంట పండించారు. అదనంగా 2,221 ఎకారాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. ఇక ఈ ఏడాది 39,820 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా ఏకంగా 44,712 ఎకరాల్లో రైతులు పంట వేశారు. అంచనాకంటే అదనంగా 4,892 ఎకరాల్లో మిర్చి పండిస్తున్నారు. సీజన్‌ ఆరంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురిశాయి. దీంతో రైతులు వరి, పత్తి ఇతర పంటలతో మిర్చి వేశారు. విపరీతంగా కురసిన వర్షాలకు అక్కడక్కడా మిర్చి చేల్లో మొక్కలు మురిగిపోయాయి. వీటి స్థానంలో రైతులు తిరిగి మొక్కలు నాటారు. కొందరు నారు. పోసుకోగా అధిక వర్షాలకు పాడైంది. దీంతో నర్సరీల నుంచి నారు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో నారుకు డిమాండ్‌ పెరగడంతో నర్సరీ నిర్వహకులు ఒక్కో మొక్కను రూపాయిన్నర నుంచి రెండు రూపాయలకు అమ్మారు. అనుమతులు లేకుండా నడుస్తున్న నర్సరీల  నిర్వాహకులకు అధికారులు నోటీసులు ఇచ్చి కొన్నింటిని సీజ్‌ చేశారు. ఈ నెలలో బయ్యారంలో ఓ నర్సరీ నిర్వాహకుడి వద్ద రైతులు అందోళన చేశారు.  

44,712 ఎకరాల్లో పంట

జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో ఈ ఏడాది 44,712 ఎకరాల్లో మిరప వేశారు. బయ్యారం మండలంలో 1,735.36 ఎకరాలు, గంగారంలో 16.14, గార్లలో 2,531.09, గూడురులో-2,558.26, కేసముద్రంలో 2,206.12, కొత్తగూడలో-99.06, మహబూబాబాద్‌లో 7,493.17, నెల్లికుదురులో-2,180.26, చిన్నగూడురులో-657.02, దంతాలపల్లిలో 592.32, డోర్నకల్‌లో 8,401.33, కురవిలో 7,541.04, మరిపెడలో 5,966.33, నర్సింహులపేటలో 1,945.36, పెద్దవంగరలో 369.10, తొర్రూర్‌లో 416.17 ఎకరాల చొప్పున మొత్తం 44,712.33 ఎకరాల్లో రైతులు మిచ్చి పండిస్తున్నారు.  

సాగు పెరిగింది..

జిల్లాలో ఈ ఏడాది 39,820 ఎకరాల్లో మిర్చి సాగవుతుందని అంచనా వేశాం. కానీ, రైతులు 44,712 ఎకరాల్లో వేశారు. నాణ్యత లేకుండా మిర్చి నారు అమ్మిన నర్సరీలపై చర్యలు తీసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నర్సరీలను తనిఖీ చేశాం. మిర్చినారు ఎక్కువ ధరకు అమ్మిన నర్సరీల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం.

 - సూర్యనారాయణ, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి, మహబూబాబాద్‌