సోమవారం 26 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 27, 2020 , 06:31:33

‘గిరివికాస్‌'కు దరఖాస్తు చేసుకోవాలి

‘గిరివికాస్‌'కు దరఖాస్తు చేసుకోవాలి

మహబూబాబాద్‌: ఏజెన్సీ మండలాల్లో గిరివికాస్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నా రు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీవో హన్మం తు, అదనపు కలెక్టర్‌ అభిలాష్‌అభినవ్‌తో కలిసి గిరివికాస్‌ పథకంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతవాసులకు గిరివికాస్‌ పథకం వరమని, అధికారులు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల నుంచి దరఖాస్తులు స్వీ కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఈవో సన్యాస య్య, డీఆర్డీవో విద్యాచందన, డీపీవో లత పాల్గొన్నారు.


logo