బుధవారం 28 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 27, 2020 , 06:31:33

పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలి

పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలి

  • ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌ : నిరుపేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌, 58,59జీవోలపై శనివారం ఎమ్మెల్యే పట్టణంలోని తన నివాసంలో కౌన్సిలర్లుకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసైన్డ్‌ భూముల్లో ఉన్న ప్రతి నిరుపేద ఇంటిని ఉచితంగా క్రమబద్ధీకరించాలన్నారు. సీఎం కేసీఆర్‌ పేదల కోసం విడుదల చేసిన 58, 59 జీవోలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కొత్త రెవెన్యూ చట్టం చట్ట ప్రకారం 59-125 చదరపు గజాల లోపు ఉన్న ఇంటిని ఉచితంగా, 125 చదరపు గజాల నుంచి అపైన ఉన్న ప్లాట్లకు మార్కెట్‌ వ్యాల్యూ ఆధారంగా ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలన్నారు. అసెంబీ సమావేశాల్లో మరోసారి అవకాశం కల్పించాలని కోరగా ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అవకాశం ఇచ్చారన్నారు. ఇంటి నంబర్‌ ఉండి మున్సిపాలిటీకి పన్ను కడుతున్న వారి ఇండ్లను తప్పకుండా క్రమబద్ధీకరిస్తామన్నారు. ప్రభుత్వ భూములు పట్టణ అభివృద్ధికి అవసరమన్నారు. జిల్లాకు మెడికల్‌ కాలేజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ యూనివర్సిటీ రావాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, కమిషనర్‌ ఇంద్రసేనారెడ్డి, తహసీల్దార్‌ రంజిత్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.logo