శనివారం 31 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 27, 2020 , 06:31:30

రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం

రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం

  • ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌
  • కురవి, డోర్నకల్‌లో కల్యాణలక్ష్మి చెక్కులు, పట్టా పుస్తకాల పంపిణీ

కురవి/డోర్నకల్‌, సెప్టెంబర్‌ 26 : సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శంగా నిలువనుందని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. ‘మన ముఖ్యమంత్రి రై తు కళ్లలో నీరు రాకుండా చూసుకుంటుంటే.. ప్ర ధాని మాత్రం రైతును కార్పొరేట్‌ కంపెనీల్లో కూలీలను చేయాలనే తపనతో ఉన్నారు’ అని అన్నా రు. కురవిలోని ఓం ఫంక్షన్‌ హాల్‌లో శనివారం ఎంపీపీ గుగులోత్‌ పద్మావతి అధ్యక్షతన 79 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, 757 నూతన పట్టా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎద్దు ఏడ్చిన వ్యవసా యం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన అందిస్తున్నారన్నారు. మరిపెడ ర్యాలీకి స్వచ్ఛందంగా కదిలి వచ్చిన రైతులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానన్నారు. తన  వయసు 68 సంవత్సరాలని, కానీ ఇప్పటికీ 28 ఏండ్లే అని చమత్కరించారు. ఉగ్గంపల్లి తండాలో ఉంటూ ప్రజలకు సేవ చేయడమే తన విజయ రహస్యమన్నారు. కాగా, ‘బోర్లకు మీటర్లు బిగించు.. నీ రాష్ర్టానికి రూ. 4 వేల కోట్లు ఇస్తానని ప్రధాని అంటుంటే.. రూ. 4 వేల కోట్లు కాదు.. రూ. 40 వేల కోట్లు ఇచ్చినా నాకు అవసరం లేదని తెగేసి చెప్పిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. అలాగే డోర్నకల్‌ మండలంలోని మన్నెగూడెంలో రూ. 22 లక్షలతో చేపట్టనున్న రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 42 మందికి కల్యాణలక్ష్మి  చెక్కులు, 397 మందికి పట్టాదారు పుస్తకా లు అందజేశారు.

మన్నెగూడెం గ్రామపంచాయతీ కాల్యతండాలో రూ. 5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీపీ బాలునాయక్‌, జడ్పీటీసీ పొడిశెట్టి కమలారామనాథం, మున్సిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న, వైస్‌ చైర్మన్‌ కేశబోయిన కోటిలింగం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నున్న రమణ, పీఎసీఎస్‌ చైర్మ న్లు చేరెడ్డి భిక్షంరెడ్డి, కొండపల్లి సీతారామరెడ్డి, ఎం పీటీసీ విజయపాల్‌రెడ్డి, సర్పంచ్‌ కొండపల్లి రాధి క, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్‌, యూత్‌ మండలాధ్యక్షుడు కల్లెపు సతీశ్‌గౌడ్‌, జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షుడు తోట లాలయ్య, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ రమేశ్‌, సుధాకర్‌రెడ్డి రామునాయక్‌, వైస్‌ ఎంపీపీ దొంగలి నర్సయ్య పాల్గొన్నారు.