బుధవారం 28 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 26, 2020 , 05:31:42

ఆర్డినెన్స్‌లు రద్దు చేయాల్సిందే..

ఆర్డినెన్స్‌లు రద్దు చేయాల్సిందే..

  • మోదీ ప్రభుత్వానికి పతనం తప్పదు
  • జిల్లావ్యాప్తంగా నిరసనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై  శుక్రవారం జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆర్డినెన్స్‌లను రద్దు చేయాల్సిందేనని కర్షకలోకం ముక్తకంఠంతో నినదించింది. స్వేచ్ఛావాణిజ్యం పేరుతో రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, మోదీ ప్రభుత్వానికి పతనం తప్పదని టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు.

మహబూబాబాద్‌ : మోదీ ప్రభుత్వానికి పతనం తప్పదని కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌హెచ్‌-365ని దిగ్బంధించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్‌సారథి, సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు మురళీనాయక్‌, సీపీఐ(ఎంల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు లింగన్న మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కార్పొరేట్‌ శక్తులకు దేశాన్ని తాకట్టుపెట్టే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

పెద్దవంగర (తొర్రూరు) : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని అఖిలపక్ష పార్టీల నాయకులు అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని విశ్రాంత భవనం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం పక్కదారి పట్టించే కుట్రలు చేస్తుందని, ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు తమ్మెర విశ్వేశ్వర్‌రావు, కొత్తపల్లి రవి, మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, జడ్పీఫ్లోర్‌ లీడర్‌ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ హరిప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సీతారాములు, రైతుబంధు మండల కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, నాయకులు వెంకటనారాయణగౌడ్‌, వీరన్న, శ్రీమన్నారాయణ, అశోక్‌ పాల్గొన్నారు. 

మరిపెడ : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై శుక్రవారం మరిపెడ బస్టాండ్‌ సెంటర్‌లో సీపీఎం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు బాణాల రాజన్న, ఎల్లయ్య, వెంకన్న, రమేశ్‌, సురేశ్‌ పాల్గొన్నారు.

కురవి : రైతు వ్యతిరేక ఆర్డినెన్సులను తీసుకొచ్చిన కేంద్రం కుటిలనీతిని పార్టీలకతీతంగా ప్రజలు తిప్పికొట్టాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కురవిలో ఎన్‌హెచ్‌-365పై అఖిలపక్షం నాయకులు నల్లు సుధాకర్‌రెడ్డి, రంగన్నగౌడ్‌, ఖాజా, పాపయ్య ఆధ్వర్యంలో ఆం దోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజన్న, తురక రమే శ్‌, మోహన్‌రావు, రాజేందర్‌, వీరభద్రం, గణేశ్‌, వీరన్న, సైదులు, కృష్ణయ్య, వీరయ్య, సారయ్య, వెంక న్న, మధుసూదన్‌, గురువయ్య పాల్గొన్నారు.

కేసముద్రంటౌన్‌: అప్రజాస్వామిక పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని మిత్ర పక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి మార్కెట్‌ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడా రు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు రావాలంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర పక్షాల నాయకులు గుగులోత్‌ దస్రూనాయక్‌, చొప్పరి శేఖర్‌, యాకూబ్‌రెడ్డి, వెంకన్న, కట్టయ్య, నాగేశ్వర్‌రావు, పాపారావు, కిషన్‌,  భాస్కర్‌, భాస్కర్‌రెడ్డి, వెంకటయ్య, అనసూర్య పాల్గొన్నారు. 

గార్ల : అన్నదాతలకు నష్టం కలిగించేలా ఉన్న వ్యవసాయ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాధాకృష్ణ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌తోపాటు సీపీఎం, సీపీఐ, ఎన్డీ, కాంగ్రె స్‌, టీడీపీ, అనుబంధ సంఘాల నాయకులు మండలంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు నష్టం చేసే బిల్లులను రద్దు చేయకపోతే ఉద్యమాలు తప్పవన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, ఎం గిరిప్రసాద్‌, కే శ్రీనివాస్‌, నర్సింహరావు, జే సత్యనారాయణ, సక్రు, రామారావు, కృష్ణాగౌడ్‌, సత్యం, యాదగిరి పాల్గొన్నారు.

నెల్లికుదురు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నాయకులు వెంకటేశ్వర్లు, తిలక్‌, వెంకన్న డిమాండ్‌ చేశారు. న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్‌ శక్తుల కోసమే మోదీ వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆలకుంట్ల సాయి లు, అశోక్‌, సైదులు, భిక్షపతి, అనిల్‌ పాల్గొన్నారు. 

దంతాలపల్లి : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులకు నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాములు, యాకన్న, హరీశ్‌, శ్రీనివాస్‌, సతీశ్‌, గురుపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

మహబూబాబాద్‌ రూరల్‌ : చిన్న, సన్న కారు రైతులను మరింత పేదలుగా మార్చే ఆర్డినెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీపీఎం మానుకోట రూరల్‌ కార్యదర్శి రామ్మూర్తి కోరారు. శుక్రవారం కంబాలపల్లి గ్రామంలో నేషనల్‌ హైవేపై నిరసన చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలు, రాములు, ప్రశాం త్‌, నవీన్‌, కిరణ్‌, అఖిల్‌ పాల్గొన్నారు. logo