మంగళవారం 27 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 24, 2020 , 06:32:10

మేలుజాతి పశువుల ఉత్పత్తిని పెంచాలి

మేలుజాతి పశువుల ఉత్పత్తిని పెంచాలి

మహబూబాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 23  : జిల్లాలో మేలు జాతి పశువుల ఉత్పత్తిని పెంచాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ అంగోతు బిందు అన్నారు. బుధవారం జడ్పీ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పశువైద్యశాలలో వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉంచాలన్నారు. కృత్రి మ గర్భధారణ, పాల ఉత్పత్తి పెంపు, పశువులకు మందుల లభ్యత, కోళ్ల పెంపకం, డెయిరీ, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సన్యాసయ్య, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సుధాకర్‌ పాల్గొన్నారు.


logo