బుధవారం 21 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 24, 2020 , 06:32:01

‘రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలి’

‘రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలి’

మహబూబాబాద్‌ టౌన్‌/ గార్ల, సెప్టెంబర్‌ 23 : కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని వామపక్ష నాయకులు అన్నారు. బుధవారం స్థానిక వీరభవన్‌లో వారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు బీ విజయసారథి, సాదుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ... రైతుకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా ఆర్డినెన్సులు జారీ చేసిందన్నారు. ఈ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయని, వ్యవసాయానికి మరణ శాసనాలుగా మారాయన్నారు. శుక్రవారం దేశ వ్యాప్తంగా జరిగే రాస్తారోకో, ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్‌, పెరుగు కుమార్‌, చింతకుంట్ల వెంకన్న, సీపీఎం పట్టణ కార్యదర్శి సమ్మెట రాజమౌళి, యమగాని వెంకన్న పాల్గొన్నారు. విద్రోహకర  సంస్కరణలతో రైతులకు నష్టం జరుగుతున్నదని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకుడు జడ సత్యనారాయణ అన్నారు. గార్లలోని ఐతపు మంగపతిరావు భవన్‌లో కందునూరి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసి సమావేశంలో  రైతు సంఘాలు, వామపక్ష నాయకులు దనియాకుల రామారావు, గుగులోత్‌ సక్రునాయక్‌, జంపాల వెంకన్న, వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు, కోటి, శ్రీను పాల్గొన్నారు.

కార్మికుల కష్టాలు గాలికొదిలి...

మహబూబాబాద్‌ : కరోనా కష్టాలతో కార్మికులు తల్లడిల్లు తుంటే కేంద్రం వారిని పట్టించుకోవడం లేదని జీటీయూ జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్‌, నవీన్‌, బిల్లకంటి నూర్యం అన్నారు. కార్యక్రమంలో నాయకులు తోట భిక్షం, నాగన్న, కోటేశ్వర్‌రావు, శంకర్‌, లింగన్న పాల్గొన్నారు.

కేసముద్రంటౌన్‌ : కార్పొరేట్‌ పెట్టుబడి దారులకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని వామపక్ష నాయకులు ఆరోపించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మంద భాస్కర్‌, శివ్వారపు శ్రీధర్‌, మర్రిపెల్లి మొగిళి, చాగంటి కిషన్‌, వీరన్న, వెంకటయ్య, మహర్షి, కిషన్‌రావు, రాజు పాల్గొన్నారు. 

కురవి: కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరు తూ పార్టీలకతీతంగా పోరాడాలని టీపీసీసీ అధికారి డీవై గిరి బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజలంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే రైతు వ్యతిరేక బిల్లును తీసుకురావడం అనైతిక చర్యగా ఆయన పేర్కొన్నారు.logo