సోమవారం 26 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 23, 2020 , 03:18:56

అక్రమ దందా చేస్తే కఠిన శిక్షలు

అక్రమ దందా చేస్తే కఠిన శిక్షలు

మరిపెడ, సెప్టెంబర్‌ 22 : అక్రమ దందా చేస్తే కఠిన శిక్ష లు ఉంటాయని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. జిల్లాలో బెల్లం రవాణా, బియ్యం దం దా, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని వారిపై జిల్లా పోలీ స్‌ యంత్రాంగం గట్టి నిఘా పెట్టినట్లు చెప్పారు. మరిపెడ పీఎస్‌లో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు.  రేషన్‌ బియ్యం కిలో రూ.5కు కోనుగోలు చేసి ఇతర రాష్ర్టాల్లో రూ.18కి విక్రయిస్తున్నారని, వారిపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ర్టాలకు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు మంగళవారం మరిపెడ ఎస్సై సిరిసిల్ల అశోక్‌ తన సిబ్బందితో గుండెపూడి, వీరారం శివార్లలో దాడులు చేశారు. 145 క్వింటాల బియ్యం, లారీ, బొలెరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన బియ్యాన్ని సివి ల్‌ సప్లయి డీటీ నారాయణరెడ్డికి అప్పగించగా, వాహనాలను స్థానిక పోలీసులు సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిందితులు అంగడి వెంకటేశ్వర్లు, పేరం ఎల్లయ్య (గుండెపూడి), కుం భం గోవర్ధన్‌ (సూర్యపేట జిల్లా కోదాడ), రామంతలి షేక్‌(లారీ డ్రైవర్‌), షేక్‌ షబ్బీర్‌(లారీ క్లీనర్‌) కర్ణాటక, బాదావత్‌ బిచ్చా బొలెరో డ్రైవర్‌(వీరారం)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తొర్రూరు డీఎస్పీ ఎం వెంకటరమణ, మరిపెడ సీఐ ఎం కర్ణాకర్‌ అక్రమ దందాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ ప్రశంసించారు. అక్రమ దందా చేస్తే సస్పెక్టెడ్‌ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే రౌడీ షీట్స్‌ తెరుస్తామని హెచ్చరించారు. మరిపెడ ఎస్సై అశోక్‌, పోలీస్‌ కానిస్టేబుళ్లు  సమ్మ్‌లాల్‌, మంగీలాల్‌, రుద్రయ్య, హకీమ్‌, కుమారస్వామికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, మరిపెడ సీఐ కర్ణాకర్‌, ఎస్సైలు అశోక్‌, రామటెంక భిక్షపతి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo