బుధవారం 28 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 22, 2020 , 02:53:13

బాపూజీ జీవితం ఆదర్శనీయం

బాపూజీ జీవితం ఆదర్శనీయం

తొర్రూరు : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం ఆదర్శనీయమని కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌ గడ్డం ఈశ్వర్‌ అన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా సోమవారం డివిజన్‌ కేంద్రంలోని విశ్రాంతి భవన ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కోట్లాడిన యోధుడని, మూడు తరాల ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో ఆయా సం ఘాల ప్రతినిధులు పెండెం రమేశ్‌, బుదారపు శ్రీనివాస్‌, విద్యాసాగర్‌, శంకర్‌, వెంకన్న, ప్రభాకర్‌, వెంకటేశ్వ ర్లు, చంద రవీందర్‌, పులేందర్‌, కల్యాణపు రాజు, తుమ్మ శ్రీరాములు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

విలక్షణ నాయకుడు.. 

మహబూబాబాద్‌ టౌన్‌ : విలక్షణ నాయకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దె రవి అన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా సోమవా రం స్థానిక పద్మశాలి భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవి మా ట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడని అ న్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, భద్రయ్య, వెంకటేశ్వర్లు, నారాయణ, శ్రావణ్‌ పాల్గొన్నారు. 


logo