శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 22, 2020 , 02:53:15

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

బయ్యారం: కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉం టుందని ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ అన్నారు. మండ లంలోని కొత్తపేటకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ క్రియాశీలక సభ్యుడు భూక్యా లక్ష్మణ్‌ కొన్నినెలల క్రితం ఖమ్మం సాగర్‌ కాల్వలో పడి మృతి చెందగా, రూ.2లక్షల బీమా చెక్కును సోమవారం ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలో పేతానికి పాటుపడే కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ అండగా ఉం టుందన్నారు. తోటి కార్యకర్తలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు అండగా నిలువాలని కోరారు. అనంతరం జగత్‌రావుపేట సర్పంచ్‌ అనిత ఇటీవ ల అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షుడు రెంటాల బుచ్చిరెడ్డి, ఎంపీపీ చేపూరి మౌనిక, వైస్‌ ఎంపీపీ గణేశ్‌, మండల కమిటీ సభ్యలు సత్యనారా యణ, ఐలయ్య, ప్రభాకర్‌రెడ్డి, సోందు, మురళి ఉన్నారు. జగత్‌రావుపేట సర్పంచ్‌ అనిత కుటుంబానికి సర్పంచ్‌ల సంఘం తరఫున రూ.60వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, స ర్పంచ్‌లు కోటమ్మ, రమణమ్మ, రమేశ్‌ పాల్గొన్నారు.