బుధవారం 02 డిసెంబర్ 2020
Mahabubabad - Sep 21, 2020 , 05:27:41

మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌

మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌

  • సారు కలలుగన్న బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కృషి
  • యువత ఆయన జీవితాన్ని  ఆదర్శంగా తీసుకోవాలి
  • కరోనా బాధితులు భయపడొద్దు
  • జయశంకర్‌ విగ్రహావిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలలుగన్న బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరులో జయశంకర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి జయశంకర్‌ అన్నా రు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని బంగా రు తెలంగాణగా మారుస్తున్న క్రమంలో సారు ఉం టే ఎంతో బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును సార్‌ స్ఫూర్తితోనే పూర్తి చేశామన్నారు. ‘జయశంకర్‌ సార్‌, మా నాన్న మంచి స్నేహితులు. నా బాల్యంలో వారి ఇంట్లోనే ఒక నెల ఉండి చదువుకున్నా’ అని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిందని భయభ్రాంతులకు గురికావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని జయించొచ్చన్నారు.

కాగా, తొర్రూరులో సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చి న్నఅంజయ్య, జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ హరిప్రసాద్‌, డీఎస్పీ వెంకటరమణ, జయశంకర్‌ విగ్రహావిష్కరణ కమి టీ నాయకులు కృష్ణప్రసాద్‌, విక్రం, సురేశ్‌, కుశా ల్‌, శ్రీనివాసాచారి, సోమసత్తయ్య, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.