మంగళవారం 27 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 21, 2020 , 05:27:40

త్వరలో జిల్లా కోర్టు భవన నిర్మాణ పనులు

త్వరలో జిల్లా కోర్టు భవన నిర్మాణ పనులు

  • ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి జడ్జి జయకుమార్‌

గణపురం, సెప్టెంబర్‌ 20 : జిల్లా కోర్టు భవనం నిర్మాణం కోసం సూచించిన స్థలాన్ని ఆదివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి జయకుమార్‌ పరిశీలించారు. మండలంలో మైలారం గుట్టమీద  205 సర్వే నంబర్‌లో ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాల స్థలంలో జిల్లా కోర్టు, సబ్‌ కోర్టు, రెండు మున్సిఫ్‌ కోర్టుల సముదాయంతో పాటు న్యాయమూర్తుల నివాస గృహాలను కూడా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో భవన నిర్మాణ పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎస్సై శేషాల రాజన్‌బాబు, కోర్టు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది మోటపోతుల సురేందర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి..

కృష్ణకాలనీ : జిల్లా కోర్టు ఏర్పాటుకు తాత్కాలికంగా కేటాయించిన భవన మరమ్మతులు డిసెంబర్‌ 10లోపు  పూర్తి చేయాలని జడ్జి జయకుమార్‌  ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లిలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయనున్న పాత నగరపంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట పరకాల కోర్టు జడ్జి హుస్సేన్‌, న్యాయవాదులు శ్రీనివాసాచారి, సంగెం రవీందర్‌, మహ్మద్‌ రఫీ, మంగళపల్లి రాజ్‌కుమార్‌, తోట పరమేశ్వర్‌, రాజేందర్‌, మొయినొద్దీన్‌ ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.      

తాజావార్తలు


logo