గురువారం 29 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 20, 2020 , 06:47:31

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలిడీఆర్‌డీఏ ఏపీడీ వెంకట్‌

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలిడీఆర్‌డీఏ ఏపీడీ వెంకట్‌

తొర్రూరు : మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ ఏపీడీ వెంకట్‌ అన్నారు. శనివారం డివిజన్‌ కేంద్రంలోని మదర్‌ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బ్యాంకు రుణాలను చెల్లించేలా మహిళలను చైతన్య పర్చాలన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూ నిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా సంఘాలు సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ జీవనోపాధి నైపుణ్యలను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐబీ ఏపీఎం ఉపేందర్‌, ఐకేపీ ఏపీఎం వరదయ్య, సీసీలు ఉషారాణి, పద్మావతి, వెంకటయ్య, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.logo