మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Mahabubabad - Sep 16, 2020 , 04:05:59

గాడినవడ్డది..

గాడినవడ్డది..

  • కుదుటపడుతున్న ఆర్టీసీ
  • వారం నుంచి మొదలైన ప్రయాణికుల తాకిడి
  • నిన్నమొన్నటిదాకా అంతంతమాత్రమే సర్వీసులు
  • ప్రస్తుతం రీజియన్‌కు రూ.65లక్షల ఆదాయం
  • ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఆర్టీసీ

సుబేదారి : కొవిడ్‌తో ప్రజా రవాణా స్తంభించి ఒక్కసారిగా కుదేలైన ఆర్టీసీ.. ఇప్పుడిప్పుడే గాడినపడుతోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కొంత తగ్గడం, జనం రోజువారీ పనుల్లో నిమగ్నమవడంతో వారం నుంచి ప్రయాణికుల తాకిడి పెరిగింది. వరంగల్‌ రీజియన్‌లో 10 బస్సు డిపోలున్నాయి. వీటి పరిధిలో 612 ఆర్టీసీ, 399 అద్దె బస్సులున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 850 బస్సులు నడిచేవి. ఆ సమయంలో అంటే ఫిబ్రవరి నెలలో కోటీ 30 లక్షల ఆదాయం సమకూరింది. కొవిడ్‌ వ్యాప్తి పెరిగిన తర్వాత తొమ్మిది డిపోల నుంచి పరిమిత సంఖ్యలో బస్సులు నడిపారు. వరుసగా ఐదు నెలల నుంచి అంతంత మాత్రంగా బస్సులు నడుపడంతో సంస్థ నష్టాలను చవిచూసింది. జూన్‌, జూలై నెలల్లో తిరిగిన బస్సుల సంఖ్య డిపోకు 40 మించలేదు. మొన్నటివరకు రీజియన్‌ మొత్తంగా 30 లక్షల్లోపే ఆదాయం వచ్చింది. ఆగస్టు నెలాఖరు నుంచి క్ర మంగా రద్దీ పెరిగింది. ముఖ్యంగా పాలకుర్తి, భూపాలపల్లి, ఏటూరునాగారం, కరీంనగర్‌, పరకాల, సిద్దిపేట, జనగామ రూట్లు, పలు గ్రామీణ రూట్లలో బస్సులు కిటకిటలాడుతుండడంతో ఆదాయమూ పెరుగుతున్నది. మొదట డీజిల్‌ ఖర్చులు కూడా రాక నష్టాల బాట పట్టిన సంస్థ ఇప్పుడు కుదుటపడిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

వారం నుంచి ఆదాయం పెరిగింది..

కరోనా ప్రభావం ఆర్టీసీపై చాలా ప డింది. కొద్దిరోజుల నుంచి ప్రయాణికుల తాకిడి పెరిగింది.వారం నుంచి 60 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. దసరా తో ఆర్టీసీ మరింత పుంజుకునే సూచనలున్నాయి. రద్దీని బట్టి బస్సులను నడుపుతున్నాం. మొదట్లో బస్సులో ఐదారుగురు మాత్రం ఎక్కేవారు. ప్రజల్లో వైర స్‌ నియంత్రణపై అవగాహన పెరిగింది. ఇప్పుడు బస్సులో సగటున 30నుంచి 40 మందికి ప్రయాణిస్తున్నారు.

- ఏ శ్రీధర్‌, రీజినల్‌ మేనేజర్‌logo