రైతులకు మంచిరోజులొచ్చాయి

గూడూరు, ఆగస్టు 25 : రైతులకు మంచిరోజులొచ్చాయని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మండలంలోని 16 గ్రామాలకు చెందిన 150 మంది రైతులకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శైలజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పట్టాదారు పాస్‌పుస్తకాలను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా రైతే సీఎంగా ఉండటం రైతుల అదృష్టమన్నారు. గతంలో వర్షాకాలం వచ్చిందంటే రైతులు తమ భార్యల తాళిబొట్టును వడ్డీవ్యాపారుల వద్ద పెట్టి పెట్టుబడికి డబ్బులు తెచ్చుకునేవారన్నారు. కానీ, నేడు ఆ రోజులు పోయి ప్రభుత్వమే పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నదని అన్నారు. 2005లోపు పోడు చేసుకున్న రైతులందరికీ హక్కుపత్రాలు, పట్టాలు ప్రభుత్వం తరుఫున ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు రైతులపై సానుకూల ధృక్పథం కలిగి ఉండాలని, భూమి సమస్యలు లేకుండా క్లియర్‌గా ఉండాలని సూచించారు. సాగులో ఉన్న రైతులందరికీ పాస్బుక్లివ్వాలని వారికి సూచించారు. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు పంట నష్ట పోయారని, అధికారులతో సర్వే చేయించి వారికి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇసుకమేటలు వేసిన పొలాలను చూసి చలించిపోయారు. అనంతరం బొద్దుగొండలో ఓడిసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఎరువుల కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ఎరువులకోసం ఆందోళన చెందొద్దని, ఎరువులు అందుబాటులో ఉన్నాయని శంకర్‌నాయక్ అన్నారు. కార్యక్రమంలో డీఏవో ఛత్రునాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏవో రాకేశ్, టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, జడ్పీటీసీ గుగులోత్ సుచిత్ర, ఎంపీపీ బానోత్ సుజాత, జడ్పీ కో అప్షన్ సభ్యుడు ఎండీ ఖాసీం, వైస్ ఎంపీపీ ఆరె వీరన్న, ఎంపీటీసీ రాధిక, టీఆర్ఎస్ నాయకులు నూకల సురేందర్, సర్పంచ్ ముక్కా లక్ష్మణ్‌రావు, రామచంద్రయ్య, కఠార్‌సింగ్, ఎడ్ల రమేష్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం
- చివరి శ్వాస వరకు అంతరిక్ష పరిశోధనల కోసమే..