ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mahabubabad - Aug 13, 2020 , 03:06:31

పునరుద్ధరణ దిశగా ‘పాకాల’

పునరుద్ధరణ దిశగా ‘పాకాల’

  •  ఆధునీకరణకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం
  • n ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చొరవతో చెరువుకు మంచిరోజులు
  • n అంచనాల తయారీకి జలవనరుల శాఖ కసరత్తు
  • n ఇంజినీర్లతో సీఈ బంగారయ్య చర్చలు

చారిత్రక పాకాల చెరువును, కాల్వలను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అంచనాలు రూపొందించాలని జలవనరులశాఖ ఇంజినీర్లను ఆదేశించింది. దీంతో ముందుగా చెరువు, కాల్వలు, ఆయకట్టుపై సర్వే చేసేందుకు ఇంజినీర్లు సమాయత్తమవుతున్నారు. అనంతరం పునరుద్ధరణకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. చెరువును అభివృద్ధి చేస్తే ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణకు నోచుకోనుండగా మరో పది వేల ఎకరాలకుపైగా ఆయకట్టు సాగులోకి రానుంది. 

వరంగల్‌రూరల్‌ జిల్లా ఖానాపురం మండలం పాకాల వద్ద 1751లో కాకతీయులు ఈ చెరువు నిర్మించారు. గణప తి దేవుడు పాకాల చెరువు కట్టించినట్లు పూర్వీకులు చెబు తుంటారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.326 టీఎంసీలు. చెరువు కట్ట పొడవు 1.90 కిలోమీటర్లు, జల వనరుల శాఖ రికార్డుల ప్రకారం పాకాల చెరువు కింద నిర్దేశిత ఆయకట్టు 18,193 ఎకరాలుంది. చెరువు కట్టకు రెండు ప్రధాన తూ ములున్నాయి. వీటిలో ఒకటి సంగెం, రెండోది టవర్‌ తూము. ఈ తూముల నుంచి సంగెం, తుంగబంధం, జాలు బంధం, పసునూరు, మాటువీరారం ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరు చేరుతుంది. సంగెం తూము కింద ఉన్న ప్రధాన కాల్వ ద్వారా అత్యధికంగా 10 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. తుంగబంధం, జాలుబంధం, పసునూరు, మాటువీరారం ప్రధాన కాల్వలు టవర్‌ తూము కింద ఉన్నా యి. ఈ తూము నుంచి నాలుగు మెయిన్‌ కాల్వల ద్వారా ఎనిమిది వేల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందుతుంది. చెరువు కింద ప్రస్తుతమున్న ఆయకట్టులో సుమారు 90 శాతం ఖానాపురం మండలానిది ఉంటే మిగతాది నర్సంపేట మండలం పరిధిలో ఉంటుంది. 

నిర్లక్ష్యంతో కాల్వల ధ్వంసం

సమైక్య పాలనలో పాకాల చెరువు నిర్లక్ష్యానికి గురైంది. దీనిని నిర్మించి 270 సంవత్సరాలైనా ఇక్కడ మరమ్మతుల్లే వు. కట్ట, తూములు, కాల్వల పునరుద్ధరణకు నోచుకోలేదు. తూములు, కాల్వలన్నీ ధ్వంసమయ్యాయి. గుర్రపుడెక్క, పూ డిక మట్టి ఆయకట్టుదారులను వెక్కిరిస్తున్నాయి. లీకేజీలతో తూములు, కాల్వల నుంచి నీరు వృథాగా పోతున్నది. వాన కాలంలో వరదకు మైనర్‌, సబ్‌ మైనర్‌, పంట కాల్వలు కొట్టు కుపోతున్నాయి. లైనింగ్‌ లేక ప్రధాన కాల్వలకు గండ్లు పడు తున్నాయి. ఆయకట్టుదారులే తలా కొంత డబ్బు పోగు చేసి తూములు, కాల్వలను తాత్కాలికంగా మరమ్మతు చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. చెరువును ఆధునీకరించాలని, శాశ్వ త మరమ్మతుల కోసం నిధులివ్వాలని ఆయకట్టు రైతులు దశాబ్దాలపాటు కోరినా సమైక్య పాలకులు పట్టించుకోలేదు.  

ఎమ్మెల్యే చొరవతో..

నర్సంపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సాగు నీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులోభాగంగా సుమారు 33 వేల ఎకరాలకు నీరందించే రామప్ప- రంగాయ ప్రాజెక్టు పనుల వేగవంతం కోసం కృషి చేశారు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మూడో దశలో రామప్ప చెరువు నుంచి ఎత్తిపోతలతో రంగాయ చెరు వుకు గోదావరి జలాలు తెచ్చారు. ఇటీవల జలవనరుల శాఖ ఇంజినీర్లు రంగాయ చెరువు ప్రాజెక్టు మోటర్లతో రామప్ప చెరువు నుంచి ఎత్తిపోతలను ప్రారంభించారు. రామప్ప నుం చి పాకాల చెరువు వద్దకు ఎత్తిపోతలతో పైపులైన్‌ ద్వారా పా కాల చెరువులోకి దేవాదుల నీటిని తీసుకొచ్చే పనిలో ఎమ్మె ల్యే తలమునకలయ్యారు. పైపులైన్‌ పనులు తుది దశకు చేర డంతో యాసంగిలో దేవాదుల నీరు పాకాల చెరువులోకి రానుంది. ఈ నేపథ్యంలో చెరువు, కాల్వల పునరుద్ధరణ కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు

. చెరువును బాగు చేస్తే 30వేల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌ పాకాల పునరుద్ధ రణకు అంచనాలు తయారు చేయాలని జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో జల వనరుల శాఖ ఇంజినీర్లు రంగంలోకి దిగారు. పాకాల కాల్వల అంచనాలు తయారు చేయడంపై బుధవారం చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ) బంగారయ్య జలవనరుల శాఖ వరంగల్‌ రూరల్‌ జిల్లా కార్యనిర్వాహక ఇంజినీరు(ఈఈ) శ్రావణ్‌కు మార్‌తో మాట్లాడారు. చెరువు, కట్ట, తూములు, ప్రధాన, మైనర్‌, సబ్‌మైనర్‌ కాల్వల పరిస్థితిపై చర్చించారు. అనంత రం పాకాల చెరువు ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌(డీఈఈ) రాంప్రసాద్‌తో మాట్లాడి మొదట సర్వే చేసేందుకు సిద్ధం కావాలని చెప్పారు. చెరువు కట్టపై బీటీ రోడ్డు, ప్రధాన తూ ములు, ఐదు మెయిన్‌ కాల్వలు, లైనింగ్‌, తూముల నిర్మా ణం, కాల్వలకు ఇరువైపులా బ్యాంకింగ్‌ పటిష్టం కోసం అం చనాలు తయారు చేసేందుకు జలవనరుల శాఖ ఇంజినీర్లు సమాయత్తమవుతున్నారు.


logo