ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mahabubabad - Aug 08, 2020 , 02:34:32

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

మహబూబాబాద్‌ రూరల్‌: మొక్కలు నాట డం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోతు బిందు అన్నా రు. జడ్పీ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆమె జడ్పీ కార్యాలయంలో మొక్క లు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. కార్యాలయ సిబ్బంది చైర్‌పర్సన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిందు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతున్నదన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలందరికీ సం క్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణల్లో పండ్లు, పూల మొక్కలు నాటు కోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సన్యాసయ్య, విద్యాలత, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు. 

ఉన్నత శిఖరాలకు ఎదగాలి

బయ్యారం : జడ్పీ చైర్‌పర్సన్‌గా అంగోత్‌ బిందు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో ఆమెకు రైతుబంధు  సమితి మండల కోఆర్డినేటర్‌ రాసమళ్ల నాగేశ్వరావు, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు వెంకటపతి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయస్సులో జడ్పీచైర్‌పర్సన్‌గా ఎన్ని కై తనదైన శైలిలో ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్న ఆమె రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. 

 బంగారు తెలంగాణే లక్ష్యం

గార్ల: బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ బిందు కృషి చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాధాకృష్ణ, జడ్పీటీసీ ఝాన్సీలక్ష్మీ అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా బిందు బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివాజీ, సొసైటీ చైర్మన్‌ దుర్గాప్రసాద్‌, సర్పంచ్‌ బన్సీలాల్‌, గార్ల ఎంపీటీసీ-2 సుజాత, నాయకులు నాగేశ్వరరావు, ఖదీర్‌, మహేందర్‌ కుమార్‌ జైన్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, వెంకట్‌రెడ్డి, లింగాల ఉమేశ్‌, జాటోత్‌ రమేశ్‌, రామారావు, కుమార్‌ గౌడ్‌, శ్రీను పాల్గొన్నారు.


logo