శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mahabubabad - Aug 07, 2020 , 03:58:56

వైరస్‌ సోకిన వ్యక్తిని గుర్తిస్తే చికిత్స సులభం

వైరస్‌ సోకిన వ్యక్తిని గుర్తిస్తే చికిత్స సులభం

స్టేషన్‌ఘన్‌ఫూర్‌, ఆగస్టు 6 : కరోనా వైరస్‌ సోకిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే సులభంగా చికిత్స చేయొచ్చని, తద్వారా దీని వ్యాప్తిని ఆరికట్టవచ్చని స్టేషన్‌ఘన్‌పూర్‌ వైద్యాధికారి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి రామునాయక్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారి ఆదేశానుసారం గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజావైద్యులతో కొవిడ్‌-19పై ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామునాయక్‌ మాట్లాడుతూ ప్రజావైద్యులు చికిత్స చేస్తున్నప్పుడు వారి వద్దకు వచ్చే రోగుల వివరాలు తెలుసుకుని స్టేషన్‌ఘన్‌పూర్‌, తాటికొండ, ఇప్పగూడెం పీహెచ్‌సీలకు సమాచారం అందిస్తే వారికి కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రవి, డాక్టర్‌ శ్రీవాణి, డాక్టర్‌ మౌనిక, డాక్టర్‌ విజయకిరణ్‌, ప్రజావైద్యుల సంఘం అధ్యక్షుడు గట్టయ్య, ఆరోగ్య సిబ్బంది సీహెచ్‌వో పి.సాంబయ్య, ఎస్‌కే జమాల్‌, వెంకటేశ్వర్లు, రేఖ, తదితరులు పాల్గొన్నారు.